2020లో సంక్రాంతికి విడుదలై అల వైకుంఠపురంలో వరకు పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ గా వెలిగింది.
ఈ సినిమాలో బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి బుట్టబొమ్మగా మారింది. అయితే అల వైకుంఠపురంలో తర్వాత సక్సెస్ ను అందుకోవడంలో ఇబ్బంది పడుతోంది. ముందు రాధేశ్యామ్, ఆ తర్వాత ఆచార్య, తమిళంలో బీస్ట్ ఇలా వరుస ఫ్లాప్స్ పూజను ఇబ్బంది పెట్టాయి. వీటికి తోడు కొత్త సినిమాలు ఆగిపోతుండటం, షెడ్యూల్స్ మారిపోతుండటంతో పూజ చేతి నుంచి సినిమాలు జారిపోతున్నాయి. లైగర్ ఎఫెక్ట్ తో పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాల్సిన జనగణమన ఆగిపోయింది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. జనగణమన తర్వాత ఇఫ్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా పూజా హెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ తెరకెక్కించిన డీజే మూవీతోనే పూజాకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గద్దలకొండ గణేష్ లో చేసింది చిన్న పాత్రే అయినా చాలా పేరొచ్చింది. అదే స్పీడ్ లో పవన్ మూవీలోనూ పూజ నటించాల్సింది కాని సేమ్ టైమ్ కు మహేష్ బాబు కొత్త సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయడంతో పవన్ మూవీ మిస్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మాత్రమే ఉంది.