జూన్ లో ఆదిపురుష్ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ లో సలార్ రిలీజ్ ఉంది. ఈ ఏడాది ఈ రెండు సినిమాలు అనుకుంటే పొరపాటే ఎందుకంటే సలార్ రిలీజ్ తర్వాత వెంటనే మరో మూవీ విడుదల చేయాలనుకుంటున్నాడు ప్రభాస్.
ఆ సినిమా మరెదో కాదు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా డీలక్స్. ఈ మూవీ కొత్త షెడ్యూల్ వచ్చే నెల ప్రారభం కానుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తైందట. అందుకే మూవీని దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. అదే నిజమైతే నెల తిరగకుండానే ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కావడం ఖాయం. సలాల్ వెంటే రాజా డీలక్స్ రావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా సలార్ లాంటి యాక్షన్ ఫిల్మ్ తర్వాత రాజా డీలక్స్ లాంటి కూల్ ఫిల్మ్ రిలీజ్ అయితే ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఆదరిస్తారని పక్కా ప్లానింగ్ తో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు యూవీ క్రియేషన్స్ వారు. ఈ ఏడాది ఈ మూడు రిలీజైతే వచ్చే ఏడాది కొంత టైమ్ తీసుకుని ప్రాజెక్ట్ కెతో ప్రేక్షకుల ముందుకు రావచ్చు అనుకుంటున్నాడు రెబల్ స్టార్.