దళపతి విజయ్ తో ఫిల్మ్?
కోలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్
తమిళనాట విజయ్ తీసుకునే నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తన స్టార్ డమ్ చెక్కుచెదర కుండా ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ వసూళ్లను పెంచుకుంటూ విజయ్ చేసే సినిమాలు అతని నిర్ణయాలు కొంత కాలం బాగా కలసివస్తున్నాయి. కోలీవుడ్ కు వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ సంచలనాత్మక నిర్ణయం విజయ్ తీసుకున్నాడట. లవ్ టుడే తో అటు తమిళనాడును, ఇటు తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించాడు ప్రదీప్ రంగనాథన్.
సరాసరి వంద కోట్ల వసూళ్లను చూసాడు. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇన్ని కోట్ల రూపాయలను కొల్లగొట్టడం వెనుక ప్రదీప్ మేకింగ్, అతని యాక్టింగ్ స్కిల్స్ మెయిన్ రీజన్. ఇప్పుడు ఈ దర్శకుడితో విజయ్ మూవీ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం వారసుడు మూవీలో నటిస్తున్నాడు విజయ్. ఈ మూవీ సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ చిత్రం చేయబోతున్నాడు. లోకేష్ తో మూవీ తర్వాతే ప్రదీప్ తో విజయ్ మూవీ ఉంటుందని కోలీవుడ్ లో బాగా ప్రచారం సాగుతోంది.