పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాగచైతన్య?
అసలు ఆ కోలీవుడ్ మూవీలో ఏం జరుగుతోంది?
థ్యాంక్యూ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత నాగ చైతన్య కొత్త సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నాడు.
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలసి తెలుగు,తమిళ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. సీనియర్ యాక్ట్రెస్ ప్రియమణి కూడా కీలకపాత్రలో కనిపించబోతోంది. ఆమె ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతోంది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈరోల్ కోసం ఇప్పుడు బాగా ప్రీపేర్ అవుతోందట ప్రియమణి. వచ్చే వారం ప్రియమణిపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారట. నాగ చైతన్య తొలిసారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. తమిళ నటుడు అరవింద్ స్వామి విలన్ రోల్ చేస్తున్నాడు. అనేకమంది తెలుగు,తమిళ నటీనటులతో ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. మూవీకి 302 అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం లో ఉంది.