పోలీసులను ఆశ్రయించిన పూరి

By KTV Telugu On 27 October, 2022
image

వరంగల్ శ్రీను, శోభన్ బాబులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు
మానసికంగా వేధిస్తున్నారు, తనపై దాడికి ఉసిగొల్పుతున్నారు

తెరపై డ్యాషింగ్ డైరెక్టర్ అని పేరుంది. జీవితం ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన వ్యక్తి. జీవితం ఎలా ఉండాలి విషయంపై పాడ్ కాస్ట్ లు పెట్టే స్టార్ డైరెక్టర్. అలాంటి మనిషికి ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందంటూ, పరుపు పోయేలా ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఆగస్ట్ 25న రిలీజైన లైగర్ సినిమాకు పూరి దర్శకుడు. రిలీజైన రోజే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో సినిమాను కోనుగోలు చేసిన డిస్ట్రీబ్యూటర్స్ నష్టపోయారు. చేసేది లేక పూరి, ఛార్మి కొంత మొత్తాన్ని బయ్యర్లకు తిరిగి చెల్లిస్తామన్నారు. అందుకోసం కొంత సమయం అడిగారు. అందుకు మొదట డిస్ట్రీబ్యూటర్స్ సానుకూలంగానే స్పందించారు. అయితే కొందరు మాత్రం పూరికి ఎదురు తిరిగారు. ఇంటిముందుకు వచ్చి ధర్నా చేస్తామని బెదిరించారు. పరువు పోతుందనే కదా అనే డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పింది. మళ్లీ ఇదేంటి అని డిస్ట్రిబ్యూటర్ల వ్యవహారం పై పూరి సీరియస్ అయిన ఆడియో టేప్ కూడా లీకైంది. అయితే లైగర చిత్ర ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ చిత్ర డిస్టిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబులు తనను వేధిస్తున్నారని ఆయన జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పూరి. శ్రీను, శోభన్‌లు డబ్బుల విషయంలో తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు పూరి. వారి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.