డిసెంబర్ 8న రష్యాలో గ్రాండ్ లెవల్లో రిలీజైంది పుష్ప.
అందుకోసం రిలీజ్ కు ముందే రష్యాలోని కీలకనగరాల్లో చిత్ర యూనిట్ పర్యటించింది.
ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాన్ని చూడాల్సిందిగా రష్యన్లకు విన్నపం చేసింది.
అయితే డిసెంబర్ 8న రష్యాలో ఏడు వందలకు పైగా స్క్రీన్స్ లో రిలీజైన చిత్రం
పెద్దగా అలరించలేకపోయింది. రెండు కోట్ల వసూళ్ల లోపే వసూళ్లు ఉన్నాయంటూ ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
ఈ వసూళ్లు చూసి చిత్ర యూనిట్ షాక్ కు గురైందట. రష్యాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ చూసి మూవీని భారీ ఎత్తున రష్యాలో విడుదల చేసారు. కాని రష్యన్లు ఎందుకో ఈ సినిమాను పట్టించుకోలేదు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.