పెద్దన్న తర్వాత రజనీకాంత్ నటిస్తున్న సినిమా జైలర్. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
అందుకే మరోకొత్త సినిమాను పట్టాలెక్కించేందుకు సూపర్ స్టార్ రెడీ అవుతున్నాడు.
అయితే అది పూర్తి స్థాయిలో నటించే చిత్రం కాదు. కేవలం అతిథి పాత్ర మాత్రమే చేస్తున్నాడు రజనీకాంత్.
ఆ మూవీ పేరే లాల్ సలామ్. సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య తెరకెక్కించనుంది. ఇప్పటికే సినిమాను ఘనంగా ప్రారంభించారు. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రజనీకాంత్ చెల్లెలిగా జీవితా రాజశేఖర్ నటిస్తోందట.
అదే నిజమైతే ఎన్నో ఏళ్ల తర్వాత జీవిత మళ్లీ తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నట్లే లెక్క.
లాల్ సలామ్ లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
రజనీకాంత్ తో గతంలో 2.0 లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ లాల్ సలామ్ మూవీని కూడా నిర్మిస్తోంది.
రజనీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీని ఆగస్ట్ లోనే రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది సన్ నెట్ వర్క్.
ఈ మూవీని బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.