యంగ్ హీరోల్లో రామ్ పొటెన్షియాలిటీ తెల్సిందే. ఎటువంటి క్యారెక్టర్ లోకైనా ఇట్టే ఇమిడిపోగలడు.
మొదటి సినిమా దేవదాసు నుంచి అదే ఎనర్జీని చూపిస్తూ వస్తున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ తో నెక్ట్స్ లెవల్ కు వెళ్లాడు. ఇప్పుడు బోయపాటి మూవీతో మరో మెట్టుఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు ఎనర్జిటిక్ హీరో.
నిజానికి డ్యూయల్ రోల్ అనేది బోయపాటికి సెంటిమెంట్ గా మారింది.
సింహా, లెజెండ్, అఖండ సినిమాల్లో ఈ ట్రెండ్ కొనసాగించి
బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఎప్పుడైతే సింగిల్ హీరో ఫార్మాట్ కు వెళ్లాడో
అప్పుడు ఫెయిల్యూర్స్ చూసాడు. భద్ర తప్పితే వినయ విధేయరామ, జన జానకి నాయక
లాంటి సినిమాలు బోయపాటి మార్క్ చూపించలేక బాక్సాఫీస్ దగ్గర విఫలం అయ్యాయి.
అందుకే రామ్ సినిమాకు సక్సెస్ ఫుల్ ఫార్ములా అప్లై చేస్తున్నాడు.
డ్యూయల్ క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్స్ 50 ఇయర్స్ ఏజ్డ్ పర్సెన్ రోల్ ఉందట.
ఆ రోల్ సినిమాకు హైలైట్ గా నిలవబోతుందట. అంతే కాదు ఫ్లాష్ బ్యాక్ ఎపిపోడ్స్ లో ఆ క్యారెక్టర్ వస్తుందట.
శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయబోతున్నారు.