విక్టరీ వెంకటేష్ రానా తొలిసారి కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ను ఫ్యామిలీతో కలసి చూడవద్దు అంటూ
రానా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా ఎందుకు చెప్పాడో ఇప్పుడు సిరీస్ చూస్తున్న వారికి అర్థమవుతోంది. సిరీస్ నిండా అడల్ట్ సీన్స్ అసభ్యకరమైన సన్నివేశాలతో నిండిపోయింది.
ముఖ్యంగా ఫ్యామిలీ మేన్ ఇమేజ్ తో ఏళ్లకు ఏళ్లు బాక్సాఫీస్ ను శాసించిన వెంకటేష్
ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడం ఏంటి అనేది కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరికొందరు వెంకీ డేరింగ్ అటెంప్ట్ ను మెచ్చుకుంటున్నారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రానా నాయుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ వెబ్ సిరీస్ కోసం దాదాపు 6 నెలల పాటు కష్టపడ్డారు వెంకీ, రానా.
నెట్ ఫ్లిక్స్ నిర్మించిన రానా నాయుడు షూటింగ్ మొత్తం ముంబైలోనే జరిగింది.
పూర్తిగా హిందీ వెబ్ సిరీస్ గా తెరకెక్కింది. తెలుగు వారికి ముఖ్యంగా వెంకీ అభిమానులకు
ఈ వెబ్ సిరీస్ నచ్చకపోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
మరి దగ్గుబాటి హీరోస్ ఈ క్రిటిసిజమ్ ను ఎలా ఫేస్ చేస్తారో చూడాల్సి ఉంది.
మొదటి సీజన్ లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. మళ్లీ ఈ సిరీస్ కు సెకండ్ సీజన్ కూడా ఉందని టాక్.