ఓ అభిమాని రణభీర్ కపూర్ దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
అందుకు రణభీర్ కూడా ఒకే అంటాడు. సెల్ఫీకి ఫోజు ఇస్తాడు.
కాని ఫస్ట్ ట్రైయల్లో సెల్ఫీ సరిగ్గా క్లిక్ కాదు.దాంతో మరో ఫోటో కోసం ఆ అభిమాని ప్రయత్నించగా
అతని చేతిలో ఉన్న ఫోన్ ను రణభీర్ విసిరేస్తాడు.
ప్రస్తుతం ఈ వీడియో పై సోషల్ మీడయాలో జోరుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ఇది ఒక యాడ్ షూట్ అని కొందరు అంటుంటే మరికొందరు రణభీర్ నిజస్వరూపం అంటూ చెప్పుకొస్తున్నారు.
ఎంత యాడ్ షూట్ అయితే మాత్రం ఇలాంటి ప్రాంక్ ఎలా ప్లాన్ చేస్తారు అనేది మరికొందరి నెటిజన్ల వాదన.
ఏది ఏమైనా రణభీర్ అలా చేసి ఉండకూడదు అనేది ఎక్కువ శాతం మంది సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్న మాట.
బ్రహ్మాస్త్ బ్లాక్ బస్టర్ తర్వాత రణభీర్ ప్రస్తుతం బాలీవుడ్ లో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు.