ప్రేమలో హీరో, హీరోయిన్ టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్

By KTV Telugu On 14 December, 2022
image

 

రెజీనా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. గ్లామర్ క్వీన్ గా వెలిగింది. మంచి యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది.
డిసెంబర్ 13 రెజీనా బర్త్ డే. దాంతో మరో హీరో సందీప్ కిషన్ ఆమెను విష్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.
అదేంటి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తే ట్వీట్ వైరల్ అవుతుందా అంటారా. బర్త్ డే ట్వీట్ లో హ్యాపీ బర్త్ డే తో పాటు లవ్ యూ అంటూ సందీప్ కిషన్ చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సందీప్, రెజీనా ప్రేమలో ఉన్నారనే వార్త వైరల్ అయింది. 2014లో విడుదలైన రారా కృష్ణయ్య చిత్రంలో వీరిద్దరు కలసి నటించారు. ఆ తర్వాత మానగరం మూవీలో కనిపించారు. రా రా కృష్ణయ్య నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా లేక ఈ మధ్య ఎప్పుడైనా లవ్ స్టోరీ మొదలైందా అనే ఎంక్వైరీలు మొదలయ్యాయి. తెలుగు, తమిళ చిత్రాలతో రెజీనా చాలా బిజీగా ఉంది. సందీప్ కిషన్ త్వరలో మైఖెల్ గా తిరిగి రాబోతున్నాడు. ఇక వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది అనేది వారిద్దరే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.