17 రోజుల్లో 10 కోట్లు దాటిన వసూళ్లు
ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచిన చిత్రం
జపాన్ లో ముత్తు రికార్డులకు మరికొంత కాలం పదిలంగా ఉండనున్నాయి. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించిన RRR జపాన్ లో భారీ వసూళ్లను అయితే అందుకుంటోంది కాని, ముత్తు రికార్డులు బద్దలు కొట్టే విధంగా ప్రభంజనం అయితే లేదు. ఈ చిత్రం 17 రోజుల్లో 10 కోట్లు మార్క్ దాటింది. మహా అయితే రెండవ స్థానంలో నిలిచిన బాహుబలి 2 వసూళ్లను RRR అధిగమించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఓపెనింగ్స్, ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ , అలాగే అత్యంత వేగంగా 10 కోట్ల మార్క్ చేరువైన భారతీయ చిత్రంగా RRR రికార్డుల్లోకి ఎక్కింది. జపాన్ తర్వాత ఈ చిత్రాన్ని మరిన్ని దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఇయర్స్ బిగ్గెస్ట్ గ్రాసర్ KGF2 వసూళ్లను వెనక్కి నెట్టడమే పనిగా రాజమౌళి ప్లానింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం RRR, KGF2 చిత్రాల మధ్య 100 కోట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. చైనా లాంటి దేశంలో త్రిబుల్ ఆర్ క్లిక్ అయితే మాత్రం, కేజీయఫ్ 2ను ఇట్టే దాటేయవచ్చు.