ఆర్ ఎక్స్ 100 తో గొప్ప సెన్సేషన్ సృష్టించాడు దర్శకుడు అజయ్ భూపతి.
రెండో సినిమాను మహాసముద్రంగా తెరకెక్కించాడు. అయితే ఈ మూవీ భీకరమైన ఫ్లాప్ గా మిగిలింది.
దాంతో కొంత సమయం తీసుకుని మంగళవారం అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు అజయ్ భూపతి.
పైగా ఈ సినిమాకు తాను దర్శకుడు మాత్రమే కాదు. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
మంగళవారం సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకుంది.
హీరో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది అజయ్ భూపతి రివీల్ చేయలేదు.
అయితే ఆర్ ఎక్స్ 100 జోడి ఇందులో నటిస్తున్నారనే టాక్ కూడా ఉంది.
ఏది ఏమైనప్పటీకీ అజయ్ భూపతి లాంటి మాస్ డైరెక్టర్ కమ్ బ్యాక్ ఇస్తే
అతని తో సినిమా చేసేందుకు చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు.
మహాసముద్రం కనుక వర్క్ అవుట్ అయ్యి ఉంటే
ఈపాటికి అజయ్ భూపతి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుండేవాడు.
మరి మంగళవారంతో అయినా అజయ్ కమ్ బ్యాక్ ఇస్తాడా అనేది వేచి చూడాలి.