బుట్టబొమ్మ ప్యార్ లో భాయ్ జాన్?
బాలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్
పవర్ సార్ పవర్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు హిందీలో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇఫ్పుడు ఈ మూవీ గురించే బాలీవుడ్ మొత్తం మాట్లాడుకుంటోంది. అందుకు కారణం ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన సల్మాన్, పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారట. బాలీవుడ్ లో సల్మాన్ లవ్ స్టోరీస్ కు కొదవలేదు. ఒక దశలో ఐశ్వర్యారాయ్ తో పెళ్లి వరకు వెళ్లాడు. ఆ తర్వాత మనసు విరిగి ఆమెతో రిలేషన్ కు గుడ్ బై చెప్పాడు. కత్రీనా కైఫ్ తో కూడా కొంతకాలం ప్రేమలో ఉన్నాడని టాక్ ఉంది. అందుకు తగ్గట్లే వీరిద్దరు ఎప్పుడు కలసి నటించినా బాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్ అందుకుంది. కాని వీరిద్దరు ఏనాడు తమ రిలేషన్ ను కన్ ఫామ్ చేయలేదు. అందుకు తగ్గట్లే రీసెంట్ గానే బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్ ను ప్రేమించి పెళ్లాడింది కత్రీనా.
దాంతో సల్మాన్ సింగిల్ గా మారిపోయాడు. ఈ దశలో కీసీ కా భాయ్ కీసీ కా జాన్ మూవీ సెట్ లో పూజా హెగ్డే తో సల్మాన్ ఖాన్ లవ్ లో పడ్డాడు అనేది బీటౌన్ ను షేక్ చేస్తోంది. సినిమాకు ప్రమోషన్ కోసం ఈ పుకార్ ను లేపారా లేక నిజంగానే వీరిద్దరు లవ్ లో ఉన్నారా అనేది ఇఫ్పుడు బీటౌన్ మస్ట్ అండ్ షుడ్ గా తెల్సుకోవాలనుకుంటోంది.