సమంత లీవ్ ఎక్స్ టెండ్. ఖుషి టీమ్ కు రిక్వెస్ట్?

By KTV Telugu On 15 December, 2022
image

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది సమంత. కొన్ని నెలలుగా ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.
అయినప్పటీకి ఇంకా వ్యాధి నయం కాలేదు. ఒక దశలో సౌత్ కొరియా వెళ్లనుందని ప్రచారం సాగింది.
కాని సమంత హైదరాబాద్ లో తన నివాసం లో ఉంటూనే వైద్యం అందుకుంటోంది.
ఒక దశలో జనవరి నుంచి సమంత ఖుషి లో పాల్గొంటాను అని చెప్పింది.
కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సమంతకు ఉన్న వ్యాధి నయం కావాలంటే ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే సమంత తన కున్న అనారోగ్య పరిస్థితు గురించి ఖుషి దర్శకనిర్మాతలకు తెలియజేసింది.
షూటింగ్ ను మరికొన్ని రోజులు వాయిదా వేయమని చెప్పుకొచ్చింది. ఈ సంగతి ఇలా ఉంటే ఈ మూవీలో సమంత కాకుండ సెకండ్ హీరోయిన్ రోల్ కోసం కృతి శెట్టిని సంప్రదిస్తున్నాడు దర్శకుడు శివనిర్వాణ. ఖుషిలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.