సమంత పూర్తిగా కోలుకోలేదు ఇన్ స్టా స్టోరీనే సాక్ష్యం

By KTV Telugu On 13 February, 2023
image

మయోసైటిస్ నుంచి సమంత పూర్తిగా కోలుకుంది. ఇక గతంలో కనిపించిన విధంగానే ఉండబోతోంది
అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే సమంత ఇప్పటికీ మయోసైటిస్ వ్యాధితో పోరాడుతోంది.
ఈ మధ్యే సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం షూటింగ్ లోకి అడుగు పెట్టినప్పటికీ
మయోసైటిస్ కు ఒక వైపు చికిత్స్ తీసుకుంటూనే మరో వైపు నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇంటి వద్దే ఉండి చికిత్స ను కొనసాగిస్తున్న ఫోటోను సమంత షేర్ చేసింది.
దాంతో సమంత ఫ్యాన్స్ కు కూడా కొంత డీలా పడ్డారు.
మార్చి నుంచి సమంత ఖుషీ ఖుషీగా ఖుషి సెట్ లోకి అడుగు పెడుతుంది అనుకున్నారంతా
కాని సమంత తన వ్యాధికి ఇంకా చికిత్స తీసుకుంటూనే అదీ రోజుకు నాలుగు గంటలు మాత్రమే
షూటింగ్ లో పాల్గొంటూ తన వర్క్ ను కంప్లీట్ చేయాలనుకుంటోందట.
సమంత జిమ్‌లో కసరత్తులు చేస్తూ మళ్లీ ఫిట్‌గా తయారవుతోందని.
అందరూ అనుకుంటుండగా ఇలాంటి ఫోటోను మళ్లీ చూడాల్సి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
వ్యాధికి సంబంధించి ఇంట్రావీనస్‌ ఇమ్యూనోగ్లోబలిన్‌ థెరపీ తీసుకుంది సమంత.
శరీరంలో బలహీనపడ్డ రోగ నిరోధక వ్యవస్థను పునరుత్తేజం చేసేందుకు ఈ ట్రీట్ మెంట్ ఉపయోగపడుతుంది.
ఇందుకోసం 4 గంటల వరకు సమయం వెచ్చించాల్సి ఉంటుంది.
సమంత పూర్తిగా కోలుకునే దగ్గర్లోనే ఉండాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.