లేడీ సూపర్ స్టార్ సమంత ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ

By KTV Telugu On 7 January, 2023
image

ఆగస్ట్ నుంచి సమంత కనిపించడం మానేసింది. అక్టోబర్ వరకు ఆమె ఎందుకు కనిపించడం లేదు అనేది,
హాట్ టాపిక్ గా మారింది. ఈలోపు యశోద మూవీ రిలీజ్ ఉండటంతో అప్పుడు సమంత తనకున్న వ్యాధి గురించి బయటపెట్టింది. గత మూడు నెలలుగా మయో సైటిస్ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉన్న సమంత ఎట్టకేలకు పూర్తి ఫిట్ నెస్ బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ రోజు ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూ లుక్ లో కనిపించిన సమంతను చూసి బీటౌన్ వాళ్లు ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు సమంత హెల్త్ పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సమంత ఇంటి వద్దే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటుండటంతో ఆమె చేతిలో ఉన్న చిత్రాలు చేజారుతున్నాయని బాగా ప్రచారం సాగింది. కాని ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చారు. పైగా జనవరి చివరి వారం నుంచి సమంత షూటింగ్స్ కు హాజరవుతుందని తెలిపారు. వారు చెప్పిన విధంగానే ఇప్పుడు సమంత మళ్లీ జనాల్లోకి రావడం శాకుంతలం ప్రమోషన్స్ కు రెడీ అవుతుండటం చూస్తుంటే త్వరలోనే ఖుషి షూటింగ్ ను కూడా సామ్ తిరిగి ప్రారంభించవచ్చు అనిపిస్తోంది.