సమంత హెల్త్ ఇష్యూ

By KTV Telugu On 5 November, 2022
image

ఖుషి వాయిదా పడింది
ఏం పల్లేదు ఫిబ్రవరీలో వస్తామంటున్న రౌడీ

సమంత అనారోగ్య సమస్య వల్ల ఆమె నటించాల్సిన మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఆ మూవీ పేరు ఖుషి. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీని అఫీసియల్ గా ఫిబ్రవరికి వాయిదా వేసామని చెప్పాడు హీరో విజయ్ దేవరకొండ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు . దాదాపు 60 శాతం షూటింగ్ కూడా పూర్తైందట. ఆగస్ట్ నుంచి సమంత సినిమా షూటింగ్స్ కు దూరంగా ఉంటూ వస్తోంది. దాంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. కాకపోతే సమంత ప్రస్తుతం వేగంగా కోలుకుంటోంది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మిగితా 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసి ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. కొత్త ఏడాదిలో షార్ట్ స్పాన్ లో సమంత నటిస్తున్న మరో బిగ్ ప్రాజెక్ట్ శాకుంతలం కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీ ౩డీలో రిలీజ్ కు రెడీ చేస్తున్ననట్లు గుణశేఖర్ చెప్పాడు. ఖుషి ఫిబ్రవరికి వాయిదా పడటం, శాకుంతలం 3డీలో రిలీజ్ కు ముస్తాబు అవుతుండటం చూస్తుంటే సమంత న్యూ ఇయర్ నుంచి షూటింగ్స్ కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసమే సమంత ప్రస్తుతం తన అరోగ్యం పై పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటోందని. కొద్దిపాటి నీరసంతో మాత్రమే ప్రస్తుతం సమంత ఇబ్బంది పడుతున్నారని, త్వరలోనే తన కమ్ బ్యాక్ టెర్రిఫిక్ గా ఉండనుందని సమంత తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు చెప్పుకొస్తున్నారు.