పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఒక వైపు రూమర్లు వస్తుండగా
ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు.
ఈ మూవీని టీసిరీస్ సంస్థ అలాగే అర్జున్ రెడ్డి నిర్మాతలు, సందీప్ వంగా కలసి నిర్మించబోతున్నారు.
అందుకు సంబంధించిన అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ దర్శకనిర్మాతలు ప్రకటించారు.
అర్జున్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ చేసి ఉంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవల్లో ఉండేదని
సందీప్ వంగా చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన డ్రీమ్ ను ఫుల్ ఫుల్ చేసుకుంటున్నాడు.
ఐకాన్ స్టార్ తో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
పుష్ప లాంటి మాస్ మూవీ తర్వాత అంతకంటే మాస్ మూవీలో నటించాలని బన్ని ఫిక్స్ అవ్వడం విశేషం.
సందీప్ వంగా అంటే ఇప్పుడు మాస్ మూవీస్ కు నయా డెఫినిషన్ గా నిలుస్తున్నాడు.
అర్జున్ రెడ్డి తెలుగు, హిందీ వర్షన్స్ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ వంగా
ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్ తో యానిమల్ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రం ఆగస్ట్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఆ తర్వాత ప్రభాస్ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ పట్టాలెక్కనుంది.
ఈ మూవీలో రెబల్ స్టార్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత సందీప్ వంగా
అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నాడు. పుష్పతో అందివచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ను
నెక్ట్స్ లెవల్ కు బన్ని తీసుకెళ్లేందుకు చేయాల్సింది అంతా చేస్తున్నాడు.