ఏపీలో పెరిగిన టికెట్ రేట్లు.. తెలంగాణలో రోజుకు ఆరు షోలు

By KTV Telugu On 11 January, 2023
image

భారీ బడ్జెట్ తో సంక్రాంతి సినిమాలు నిర్మించి ఉండటంతో
పండక్కి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మైత్రీ మూవీ మేకర్స్ కోరింది.
ఇందుకోసం దాదాపు 70 రూపాయలు పెంపుదల కోరగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 40లతో సరిపెట్టింది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం టికెట్ ధరపై గరిష్టంగా 45 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
పెరిగిన రేట్లతో ఏపీలో టికెట్ రేట్ 200 రూపాలకు పైగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇక తెలంగాణలో టికెట్ రేట్లు నిర్మాతలకు అనుకూలంగా ఉన్నాయి.
కాకపోతే అదనపు షోలకు అనుమతులు కావాలని కేసీఆర్ ప్రభుత్వానికి విన్నపం పెట్టుకోగా
జనవరి 12న వీర సింహారెడ్డి రిలీజ్ రోజున, అలాగే జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల రోజున రోజుకు 6 షోలు ప్రదర్శించవచ్చు అంటూ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాతి రోజును మాత్రం రోజుకు 5 షోలు ప్రదర్శనకు అనుమతులు ఇచ్చింది తెలంగాణ సర్కార్. రోజుకు ఆరు షోలు అంటే ఉదయం 4గంటలకు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. జనవరి 11న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ కావాల్సిన వారసుడు చివరి నిముషంలో వాయిదా పడింది. జనవరి 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది