సంక్రాంతి పండక్కి సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు చేస్తోన్న ప్లాన్స్ ఎందుకో బెడిసి కొడుతున్నాయి.
ఈ ఏడాది వారసుడు చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాడు.
కాని అది కుదరలేదు. తెలుగులో చిరు, బాలయ్య నటించిన చిత్రాలకు పోటీగా వెళ్లడం ఇష్టం లేక
మూవీని వాయిదా వేసుకున్నాడు. తమిళంలో అజిత్ కంటే ఎక్కువ స్క్రీన్స్ దక్కించుకోలేకపోయాడు.
ఇప్పుడు వచ్చే సంక్రాంతికి సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండు చిత్రాల్లో భారతీయుడు -2 సినిమాను
దీపావళికి, అలాగే రామ్ చరణ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.
కాని ఇఫ్పుడు కమల్ మూవీని సైతం సంక్రాంతికే రిలీజ్ చేయాలని భారతీయుడు -2 నిర్మాతలు పట్టుబడుతున్నారట.
అదే జరిగితే సంక్రాంతి సీజన్ లో శంకర్ మేకింగ్ లో తెరకెక్కిన రెండు సినిమాలు
ఒకేసారి విడుదల అవుతాయా అనేది ఆశక్తికరంగా మారుతుంది. అయితే దిల్ రాజు ఆ సాహసం చేయకపోవచ్చు.
భారతీయుడు -2కు లైన్ క్లియర్ చేసి వేసవి కానుకగా రామ్ చరణ్ కొత్త సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఏది ఏమైనా మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజును ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ రానుంది.