శర్వానంద్ పెళ్లంట.. ఇదే నెలలో నిశ్చితార్ధం

By KTV Telugu On 6 January, 2023
image

మహానుభావుడు పెళ్లి పీటలెక్కుతున్నాడు.
ఇటీవల ఆహా లో వచ్చిన అన్ స్టాపబుల్ షోలో పెళ్లి గురించి అడిగితే
ప్రభాస్ పెళ్లి ఎప్పుడైతే తన పెళ్లి అప్పుడే అని తప్పించుకున్నాడు.
కాని ఇప్పుడు అసలు విషయం బయటపడింది.
ఒకే ఒక జీవితం విజయం తర్వాత
శర్వానంద్ కాస్త బ్రేక్ తీసుకుని కొత్త సినిమా కోసం అంటూ
వెయిట్ తగ్గి స్లిమ్ గా అయ్యాడు.
కాని ఇంతలో ఒక ఎన్ ఆర్ ఐ అమ్మాయి నచ్చడంతో
పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తున్న అమ్మాయితో
ఇదే నెలలో అంటే జనవరి 26న ఎంగేజ్ మెంట్ జరగనుందట.
అలాగే వచ్చే వేసవిలో ఘనంగా వివాహం జరగనుందట.
త్వరలో మహానుభావుడు మ్యారేజ్ మ్యాటర్ పూర్తి వివరాలతో బయటికి రానుంది.
ఒకే ఒక విజయం సినిమా తర్వాత శర్వానంద్ కృష్ణ చైతన్య అనే దర్శకుడితో సినిమా ను అయితే ప్రారంభించాడు కాని
ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించలేకపోయాడు. ప్రస్తుతం మరో కొత్త కథకోసం శర్వా అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.