ఫిబ్రవరిలో కియారా మ్యారేజ్

By KTV Telugu On 1 January, 2023
image

భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో, తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కియారా అధ్వాని.
కొంత కాలంగా బాలీవుడ్ హీరో సిద్ధార్ద్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది.
ఆ రిలేషన్ లో భాగంగానే వీరిద్దరు షేర్ షా అనే సినిమాలో కలసి నటించారు.
ఈ సినిమా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇలా సూపర్ హిట్ కావడానికి సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా మెయిన్ రీజన్.
ఈ సంగతి ఇలా ఉంటే చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు
నిజానికి 2022 డిసెంబర్ లో పెళ్లిపీటలెక్కుతారని ప్రచారం సాగింది.
కాని ఎందుకో కాని మ్యారేజ్ ను పోస్ట్ పోన్ చేసారు.
బహుశా కియారా చేతిలో ఉన్న రామ్ చరణ్ చిత్రం, అలాగే మరో బాలీవుడ్ సినిమాలు పూర్తై తర్వాతే
మ్యారేజ్ చేసుకుంటే బెటర్ కదా అని కియారా ఫిక్స్ అయి ఉండవచ్చు.
సిద్దార్ద్ మల్హోత్రా చేతిలో కూడా రెండు చిత్రాలు ఉన్నాయి.
అవి కూడా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.
అందుకే ఫిబ్రవరిలో సిద్ధార్ద్ మల్హోత్రా, అలాగే కియారా పెళ్లిపీటలెక్కాలి అనుకుంటున్నారట.
రాజస్థాన్ లోని ప్యాలెస్ లో ఫిబ్రవరి 6న జరిగే పెళ్లి వేడకలు ఘనంగా జరగనున్నాయట.
పెళ్లి తర్వాత కొంత కాలం షూటింగ్స్ కు దూరంగా జీవితాన్ని గడిపి
ఆ తర్వాత ఎవరి ప్రాజెక్ట్స్ వారు చేసుకునే ఆలోచనలో ఉన్నారట.
కియారా కంటే ముందు సిద్ధార్ద్, మరో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తో ప్రేమలో ఉన్నాడు.
వీరిద్దరి బ్రేకప్ తర్వాత రణభీర్, ఆలియా లవ్ లో పడ్డారు. పెళ్లి కూడా చేసుకుని ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.