గత ఏడాది విడుదలైన విక్రమ్ తమిళనాట సంచలన విజయం సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు రాబట్టింది. దాంతో కమల్ అప్పులన్ని తీరిపోయాయి.
లోకనాయకుడు రెట్టించిన ఉత్సాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.
ఇదే సమయంలో మధ్యలోనే ఆగిపోయిన భారతీయుడు -2 కూడా తిరిగి ప్రారంభమైంది.
300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ నటిస్తున్న సినిమా కావడంతో
భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇప్పుడు ఆ డబ్బును అంతా తిరిగి సినిమాల్లోనే పెట్టాలనుకుంటున్నాడు.
తన బ్యానర్ ను కోలీవుడ్ లోనే టాప్ బ్యానర్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పటికే విక్రమ్ తో కలసి 2019 ఒక సినిమాను నిర్మించాడు. అయితే ఈ చిత్రం ఫెయిల్ అయింది.
ఆ తర్వాత శివకార్తికేయన్ సాయి పల్లవి కాంబినేషన్ లో మూవీ ఎనౌన్స్ చేసాడు. ఈ ప్రాజెక్ట్ కూడా పట్టలెక్కలేదు.
ఇఫ్పుడు 2020లో కనులు కనులను దోచాయంటే సినిమాను తీసిన దర్శకుడు చెప్పిన
భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శింబు హీరోగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
ఈ సినిమా కోసం కమల్ దాదాపు 100 కోట్లు వెచ్చిస్తున్నాడు. కమల్ తీరు చూస్తుంటే హీరోగా కంటే నిర్మాతగానే
ఎక్కువగా రాణించాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.