ప్రస్తుతం జైలర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు రజనీకాంత్.
ఈ సినిమా తర్వాత లాల్ సలామ్ అనే మరో మూవీలో నటించబోతున్నాడు.
అయితే ఆ మూవీలో కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ మాత్రమే ఇవ్వనున్నాడు.
ఈ రెండు సినిమాలు కాకుండా మరో మూవీ చేయాలనుకుంటున్నాడు సూపర్ స్టార్.
ఈ మూవీ కోసం కథలు వింటున్నాడు. ఇటీవల జై భీమ్ దర్శకుడు వెళ్లి రజనీకాంత్ కు ఒక కథను వినిపించాడట.
ఆ కథ సూపర్ స్టార్ కు బాగా నచ్చిందట. ఇమిడియెట్ గా మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
నిజానికి జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ సూర్యతో జై భీమ్ -2 తెరకెక్కించాలనుకున్నాడు.
మార్చి నుంచే జై భీమ్ -2 తెరకెక్కిస్తాను అని చెప్పుకొచ్చాడు.
కాని సూర్య తాను నటిస్తున్న కొత్త చిత్రంలో బిజీగా ఉండటంతో
జై భీమ్ ఆలస్యం కానుంది. ఈలోపు సూపర్ స్టార్ తో మూవీ కంప్లీట్ చేయబోతున్నాడట జ్ఞానవేల్.
అదే నిజమైతే కబాలి, కాలా చిత్రాల తర్వాత రజనీకాంత్ మరోసారి సీరియస్ సబ్జెక్ట్ లో కనిపించడం ఖాయం.