ఆగస్ట్ 11న త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించాల్సిన చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది.
అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సడన్ గా ఇండస్ట్రీ వర్గాలు ఈ సినిమా
ఆగస్ట్ 11న విడుదల అయ్యే అవకాశాలు లేవని చెప్పుకొస్తున్నాయి. అందుకు రీజన్ లేకపోలేదు.
ఇంకా చాలా షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండటం మహేష్ మరోసారి హాలీడే ట్రిప్ కు వెళ్తుండటంతో
ఈ సినిమా జులైకి పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదట. అందుకే ఆగస్ట్ లో మూవీ విడుదల కష్టం అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఆగస్ట్ దాటితే దసరాకు మూవీ రిలీజ్ చేయవచ్చు. కాని చిత్ర యూనిట్ దసరా కంటే సంక్రాంతి సీజన్ పైనే నమ్మకం ఎక్కువగా ఉంది. దసరాతో పోల్చితే సంక్రాంతికి సీజన్ వసూళ్లు ఎక్కువ.
ఈ రీజన్ వల్లే మహేష్ బాబు న్యూ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట.
అదే జరిగితే మహేష్ బాబు ఇటు రామ్ చరణ్ తోనూ అటు పవర్ స్టార్ – హరిష్ శంకర్ కాంబినేషన్ మూవీతోనూ
అలాగే నాగార్జున న్యూ మూవీ తో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ మూడు చిత్రాలతో కలసి వసూళ్లను పంచుకోవాల్సి ఉంటుంది.