సినిమాకు 125 కోట్ల పారితోషికం?
ఇంటికి వచ్చి మరీ డీల్ కుదుర్చుకున్న నిర్మాతలు….
ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలు పెద్దగా వసూళ్లు అందుకోవడం లేదు. గత ఏడాది దీపావళికి రిలీజైన పెద్దన్న కూడా పెద్దగా ఆడలేదు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరకపోయినా, రజనీకాంత్ సినిమాలకు బాగానే వసూళ్లు ఉంటుంటున్నాయి. అందుకే సూపర్ స్టార్ డేట్స్ కు డిమాండ్ తగ్గడం లేదు.
అదే స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా తగ్గడం లేదు. ఈ మధ్యే రజనీకాంత్ తో రెండు సినిమాలు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది లైకా ప్రొడక్షన్స్. లైకా అంటే రజనీకాంత్ తో గతంలో 2.0, కాలా, దర్బార్ చిత్రాలు నిర్మించిన సంస్థ. ఈ మూడు చిత్రాలు పెద్దగా వసూళ్లను అందించలేదు. దాంతో లైకా ఈసారైనా సూపర్ స్టార్ తో సూపర్ హిట్స్ కొట్టేందుకు ప్రయత్నాల్లో ఉంది. నవంబర్ నుంచి రజనీకాంత్ తో రెండు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనుంది.
వీటిల్లో ఒక్కో సినిమాకు రజనీకాంత్ కు అక్షరాల 125 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు చిత్రాలకు కలపి సూపర్ స్టార్ 250 కోట్లు అందుకోబోతున్నాడట. ఈ రెండు సినిమాల్లో ఒక మూవీని డాక్టర్ మూవీ తీసిన సిబి, మరొ మూవీని మణిరత్నం డైరెక్ట్ చేస్తాడని బాగా ప్రచారం సాగుతోంది. ఈ రెండు సినిమాల దర్శకులు ఎవరూ అనేది నవంబర్ 5న క్లారిటీ రానుంది.