సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి మరో మలుపు తిరిగింది. 2020 జూన్ 14న తాను నివసిస్తున్న అపార్ట్ మెంట్ లో
సుశాంత్ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మొదటి నుంచి ఈ మృతి పై కుటుబం సభ్యులు
సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేసూనే ఉన్నారు. అందుకు తగ్గట్లే రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓ సంచలన విషయం బయటపడింది. నాడు సుశాంత్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన వ్యక్తుల్లో ఒకరైన రూప్ కుమార్ షా ఇప్పుడు అసలు నిజం బయటపెట్టాడు. పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న సమయంలోసుశాంత్ శరీరం పై, అలాగే మెడపై అనుమానస్పద స్థితిలో గుర్తులు ఉన్నాయని అది ఖచ్చితంగా హత్య అంటున్నాడు రూప్ కుమార్. పైగా ఆ సమయంలో తన పై అధికారులకు ఆ విషయం వెల్లడించగా వారు కేవలం పోస్ట్ మార్టం నిర్వహించి పోలీసులకు అప్పగించాలని చెప్పారు. ఈ క్రమంలో రాత్రికి రాత్రి పోస్ట్ మార్టం నిర్వహించినట్లు అలాగే వీడియో తీయకుండా కేవలం ఫోటోలతో సరిపెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మొత్తంగా నిబంధనలకు విరుద్ధంగా పోస్ట్ మార్టం నిర్వహించారనే విషయం సుశాంత్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మొత్తంగా సుశాంత్ ది ఆత్మహత్య కాదని హత్యే అంటూ రూప్ కుమార్ చెప్పుకురావడంతో అసలు సుశాంత్ ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనేది సంచలనం సృష్టిస్తోంది.