తెలుగు నాట మల్టీస్టారర్ సెట్ అయిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
క్రిస్మస్ కు బాగా రీసౌండ్ చేసిన మూవీ ధమాకా ఈ సినిమా రైటర్ ప్రసన్న కుమార్ ప్రస్తుతం నాగార్జున సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇది పాత విషయమే. అయితే కొత్త విషయం ఏంటంటే ప్రసన్న కుమార్ ఈ సినిమా కోసం కూడా డబుల్ పోజ్ ఫార్ములా అప్లై చేస్తున్నాడు. కింగ్ నాగ్ ను డ్యూయెల్ రోల్ లో చూపిస్తున్నాడు.
అంతే కాదు సినిమాలో అల్లరి నరేష్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడట.
ప్రసన్న కుమార్ అంటే కామెడీకి బ్రాండ్. అలాంటి దర్శకుడి చిత్రంలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు అంటే అల్లరి నరేష్ నుంచి మళ్లీ అల్లరి ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. అల్లరి నరేష్ కూడా అల్లరి మనేసి చాలా కాలమే అయింది.
ఈ మధ్య వరుసగా సీరియస్ మూవీ చేస్తూ ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం లో ఉన్నాడు.
ఈ దశలో కింగ్ నాగ్ ఫిల్మ్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుడిగాడు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
న్యూ ఇయర్ లో నాగార్జున, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.