ఈ ఏడు పొంగల్ ఫైట్ ఇంకా జరుగుతోంది. చిరు నటించిన వాల్తేరు వీరయ్య వర్సెస్ బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి వార్ ను చూస్తున్నాం. వచ్చే ఏడాది కూడా పొంగల్ వార్ కు రంగం సిద్ధమవుతోంది. కాకపోతే ఈ ఫైట్ పాన్ ఇండియా లెవల్లో జరగనుందని సమాచారం. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా అలాగే సుకుమార్ మేకింగ్ లో అల్లు అర్జున్ నటించే మూవీ ఈ రెండిటిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. క్లాష్ విషయానికి వస్తే ఈ ఇద్దరు హీరోలు వెనక్కి వెళ్లే రకం కాదు. గతంలో ఈ ఇద్దరు మహేష్ బాబుతో తలపడ్డారు. ఇప్పుడు ఒకరికొకరు తలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. శంకర్ మేకింగ్ లో తెరకెక్కే చిత్రం మేతో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఇక పుష్ప-2 సెప్టెంబర్ తో చిత్రీకరణ పూర్తి కానుంది. అందుకే సంక్రాంతికి బరిలోకి దిగితే పాన్ ఇండియా వైడ్ గా వసూళ్లను అందుకోవచ్చు అని మెగా హీరోస్ ప్లాన్ చేస్తున్నారు.
మరి ఈ క్లాష్ లో ఎంత నిజం ఉంది అనేది రానున్న రోజుల్లో తేలనుంది.