కొన్ని చిత్రాలు కొందరు హీరోల కోసం రాసుకొస్తారు దర్శకులు. కాని ఆ హీరోలు అందుబాటులో లేనప్పుడు
అదే కథ మరో హీరో దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్లిన సినిమానే గద్దలకొండ గణేష్ మూవీ.
నిజానికి ఈ సినిమాను రవితేజ కోసం ప్లాన్ చేసాడట హరీష్ శంకర్.
అయితే ఈ సమయంలో మాస్ రాజా ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో
ఈ సినిమాను మెగా హీరో వరుణ్ తేజ్ తో తెరకెక్కించాడు హరీష్.
అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా బంపర్ హిట్టైంది.
మొదట వాల్మీకి అనే టైటిల్ అనుకున్నప్పటికీ వాల్మీకి బోయల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో
సినిమా టైటిల్ ను మార్చారు. ఇక అసలు సంగతికి వస్తే హరీష్ శంకర్ మరోసారి పవన్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక మాస్ రాజా అటు ధమాకా ఇటు వాల్తేరు వీరయ్య బంపర్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
ప్రస్తుతం రావణాసుర అలాగే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలు చేస్తున్నాడు. ధమకాతో వంద కోట్లకు పైగా వసూళ్లను చూసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మరో పాన్ ఇండియా మూవీ చేస్తానని మాట ఇచ్చాడట మాస్ రాజా.