రవితేజ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ధమాకా, విశ్వక్ సేన్ నటించి ధమ్కీ స్టోరీస్ ఒక్కటే అనేది టాలీవుడ్ డౌట్.
డౌట్ ఏంటి ఇదే నిజం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు ఒక్కరే కథా రచయత. అయనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. మెగాస్టార్ నటించిన ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటి రౌడీ అల్లుడు.
ఈ సినిమా స్టోరీని 2022కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తూ ప్రసన్న కుమార్ ముందుగా నక్కిన త్రినథరావు దర్శకత్వంతో రవితేజ హీరోగా ధమాకా తెరకెక్కేందుకు సహకరించాడు. ఇప్పుడు ఇదే రైటర్ తన ధమాకా స్టోరీని కాస్త అటూ ఇటూగా మార్చి విశ్వక్ సేన్ కు ధమ్కీగా మార్చి చెప్పేసాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పైగా రెండు సినిమాల ట్రైలర్స్ ఒకే విధంగా ఉండటంతో ఈ అనుమానాలు ఇంకా పెరిగాయి.
ఈ రీజన్ వల్లే ధమ్కీ మూవీ రిలీజ్ కు రెడీ అయినప్పటీకీ అనవసర కంపారిజన్ వస్తుందని ఫిబ్రవరికి రిలీజ్ డేట్ మారిందనే టాక్ కూడా ఉంది.