దిల్ రాజు అంటే నైజాం కింగ్. తెలుగులో అగ్ర నిర్మాత.
టాలీవుడ్ లో 50 చిత్రాలకు పైగా తీసిన బడా ప్రొడ్యూసర్
కాని ఇప్పుడు తెలుగు చిత్రాలకంటే తమిళం వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళ హీరోలు, తెలుగు దర్శకులు ఫార్ములా అప్లై చేస్తూ మొదట వారసుడు తీసాడు.
ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాడు దిల్ రాజు.
అందుకే ఇప్పుడు ఇదే దారిలో మరిన్ని తమిళ చిత్రాలు తీయాలి అనుకుంటున్నాడు.
ఇప్పటికే ధనుష్ తో చర్చలు ప్రారంభించాడట. గతంలో శర్వానంద్ తో శ్రీకారం సినిమా తీసిన కిషోర్ కు
ధనుష్ తో తీయాల్సిన తమిళ చిత్ర బాధ్యతలు అప్పగించాడట.
మరో విశేషం ఏంటంటే కిషోర్ చెప్పిన స్టోరీలైన్ ధనుష్ కు బాగా నచ్చిందట.
ఇక ప్రిన్స్ మూవీలో నటించి తెలుగు వారికి చేరువయిన మరో తమిళ హీరో శివకార్తికేయన్ తో కూడా సినిమా చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడట. శివకార్తికేయన్ ఒప్పుకుంటే హరీష్ శంకర్ తో సినిమా ఓకే చేయిస్తాను అంటున్నాడట.
మొత్తంగా తెలుగు అగ్రనిర్మాత దిల్ రాజు అదే పనిగా కోలీవుడ్ హీరోలపై ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.