తెలుగు దర్శకులకు తెలుగు మార్కెట్ గురించి అర్ధమైన తర్వాత కూడా
ఇంకా బాలీవుడ్ వైపు ఎందుకు చూస్తున్నారు అనేది అర్ధం కాకుండా ఉంది.
మొన్నటివరకు హరీష్ శంకర్ ముంబైలో బిజీగా ఉన్నాడు.
అందుకు కారణం సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలనుకోవడమే
అయితే ఏమైందో ఏమో తెలియదు కాని భాయ్ జాన్ నుంచి క్లారిటీ రాకపోవడంతో
హరీష్ మళ్లీ టాలీవుడ్ కు వచ్చి పవన్ తో మూవీ లాక్ చేసుకున్నాడు.
త్వరలో కొత్త కథతో బాలయ్యతో సినిమా చేస్తానంటున్నాడు.
ఇక కార్తికేయ-2 తర్వాత దేశ వ్యాప్తంగా చందూ పేరు వినిపించింది.
కాని ఆ తర్వాత మాత్రం మళ్లీ కొత్త సినిమా గురించి అప్ డేట్ ఇవ్వలేదు.
కార్తికేయ -3 ఎనౌన్స్ చేసి సైలెంట్ అయిపోయాడు. అయితే అసలు సంగతి ఏంటంటే
చందూ ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నాడట. కార్తికేయ హిందీలో మంచి వసూళ్లను అందుకోవడంతో
అక్కడ ఉన్న పరిచయాలతో హృతిక్ ను కలిసేందుకు సీరియస్ గా ట్రై చేస్తున్నాడట.
హృతిక్ ను కలసి స్టోరీని వినిపించి అతడిని ఇంప్రెస్ చేసి బాలీవుడ్ బిగ్ ఫిల్మ్ తెరకెక్కించాలి అనేది చందూ ప్లాన్ గా కనిపిస్తోంది.