పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే మూవీపై క్లారిటీ వచ్చేసింది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఐకాన్ స్టార్ మరోసారి త్రివిక్రమ్ తోనే సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ఇప్పటకే వీరిద్దరికి స్టోరీ ఎలా ఉండాలి అనే విషయం పై డిస్కషన్ కూడా జరిగిందట. అల్లు అర్జున్ పుష్ప -2 పూర్తైన వెంటనే అలాగే త్రివిక్రమ్ సూపర్ స్టార్ తో తెరకెక్కిస్తున్న సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడతారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలను మించి ఈ మూవీ ఉండబోతోందట. త్రివిక్రమ్ తో వరుసగా సినిమా నిర్మిస్తున్న హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల వైకుంఠపురములో మూవీ వరకు వీరి కాంబినేషన్ పవర్ టాలీవుడ్ వరకే తెలుసు.
నాల్గవ సినిమాను మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.