తమిళం ప్రేక్షకులకు బాగా చేరువైన నటుల్లో ఒకడు ఉదయనిధి స్టాలిన్.
ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన మామన్నాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదే తన చివరి చిత్రమని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా విడుదల తర్వాత తన పూర్తి జీవితం రాజకీయాలకే అంకితం ఇస్తున్నందున ఇక పై సినిమాల్లో నటించడం కుదరదు అని చెప్పుకొచ్చాడు ఉదయనిధి. పదేళ్ల క్రితం ఒరు కాల్ ఒరు కన్నాడి అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు స్టాలిన్. తెలుగులో ఇదే సినిమా ఓకే ఓకే పేరుతో డబ్ అయింది. నాటి నుంచి నేటి వరకు నటుడిగా రాణిస్తూ, నిర్మాతగా దూసుకుపోతూ తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవైపు సినిమా రంగంలో రాణిస్తూనే రాజకీయం రంగంలోనూ తనదైన ముద్ర వేసాడు. గతసారి జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్ఎల్ఏగా పోటీ చేసి విజయం సాధించాడు.
దాంతో అప్పటి నుంచి కొత్త సినిమాలను ఏవీ అంగీకరించ లేదు. ప్రస్తుతం మామన్నాన్ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు చెప్పుకొచ్చాడు ఉదయనిధి స్టాలిన్. కేవలం తన నిజయోకవర్గ పనులు చూసుకునేందుకు, రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేందుకు మాత్రమే సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపాడు ఉదయనిధి స్టాలిన్