ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్‌షో మంచి పేరు తెచ్చుకుంది. గెస్ట్‌లను తనదైన స్టైల్‌తో ఆటపట్టిస్తూ, సరదగా ముచ్చటిస్తూ ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నారు బాలయ్య. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఎపిసోడ్‌తో మొదలైన రెండో సీజన్‌లో వరుసగా రాజకీయ, సినీ ప్రముఖులను గెస్టులుగా ఆహ్వానిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ టాక్ షోకు హాజరువుతారనే విషయం లీక్ అయినప్పటినుంచి పవన్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ టీవీ షోలు, ఇంటర్యూలకు దూరంగా ఉంటారు. అలాంటిది ఆయన ఈ టాక్‌షోలో కనిపించబోతున్నారనగానే ఆ ఎపిసోడ్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. పైగా ఈమధ్య పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషిస్తున్నారు.
దాంతో ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందని అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.
ఊహించినట్లుగానే మంగళవారం బాలయ్య తో పవన్ టాక్ షో షూటింగ్ మొదలైంది. ఇక దానికి తోడు బాలయ్య అడిగే ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ అందర్లో పెరిగిపోయింది. తన షోకు హాజరైన గెస్ట్‌ల పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు బాలయ్య. మరి పవన్ కళ్యాణ్‌ను ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి కూడా అడుగురా అనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే పవన్ మూడు పెళ్లళ్లపై ఈమధ్య వైసీపీ నాయకులు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. అందువల్ల ఈ విషయాన్ని బాలయ్య తన షోలో లెవనెత్తుతాడా చూడాలి. అయితే తన పెళ్లిళ్లకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని పవన్ ముందే బాలయ్యకు షరతు విధించారని సమాచారం. ఇకపోతే పవన్ ఎపిసోడ్ లో ఆయనతో పాటు దర్శకులు క్రిష్, త్రివిక్రమ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. వీరితో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.