తొందరపడిన మోహన్ లాల్
సంచలన విజయం దిశగా హిందీ దృశ్యం 2
హిందీ మార్కెట్ లో దృశ్యం-2 సంచలన విజయం దిశగా పరుగులు తీస్తోంది.
ఇయర్స్ బిగెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకోవడం మాత్రమే కాదు, తొలి మూడు రోజుల్లోనే 50 కోట్లు రాబట్టే విధంగా దూసుకుపోతోంది.
కొన్ని నెలలుగా డల్ గా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొచ్చింది దృశ్యం -2.
అజయ్ దేవగన్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా నటించారు.
ఇదే చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసి తప్పు చేశామని భావిస్తున్నారు మోహన్ లాల్, వెంకటేష్.
ఓటీటీ కాలంలో థియేటర్స్ మూసుకుపోవడంతో,
మొదట దృశ్యం -2 మలయాళ వర్షన్ ను ఓటీటీలో విడుదల చేసారు.
అదే దారిలో వెంకీ కూడా తన తెలుగు వర్షన్ ను ఓటీటీలోనే విడుదల చేసి ఊరుకున్నాడు.