ఈసారి థియేటర్ కు వస్తున్న ఓటీటీ ఫిల్మ్
నారప్ప పుట్టినరోజు కానుకగా విడుదల
లాస్ట్ ఇయర్ జులైలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో నారప్ప థియేటర్స్ లోకి రాకుండా అటు నుంచి అటు ఓటీటీలోకి వెళ్లింది. తమిళంలో సూపర్ హిట్టైన అసురన్ సినిమాకు తెలుగులో అఫీసియల్ రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల రీమేక్ చేసాడు. నారప్పలో వెంకీ నటన అందర్నీ మెప్పించింది. అసరున్ లో ధనుష్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్లో ఉన్నప్పటికీ
ఆ క్యారెక్టర్ ను ఏమాత్రం చెడగొట్టకుండా వెంకీ తనదైన శైలిలో నారప్ప పాత్ర ను పోషించాడు.
ఈ మధ్యకాలంలో వెంకీ ఇంత యాంగ్రీమాన్ క్యారెక్టర్ చేయలేదు. ఆ రీజన్ కూడా ఈ ఓటీటీ ఫిల్మ్ సక్సెస్ కావడానికి మరో రీజన్. అందుకే ఓటీటీలో నెటిజన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అప్పుడే థియేటర్ లో రిలీజైతే బాగుండు అనుకున్నారు. ఇప్పుడు వారి కల నెరవేరుతోంది. డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. నారప్ప థియేటర్స్ లోకి వస్తుండటంతో వెంకీ ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ సినిమాను చూసేందుకు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.