ముందు అర్జున్ రెడ్డి, ఆ తర్వాత గీత గోవిందం ఒక అప్ కమింగ్ యాక్టర్ ను స్టార్ ను చేసాయి.
కాని ఆ తర్వాత అతను తీసుకున్న నిర్ణయాలు ఎంపిక చేసుకున్న కథలు విజయ్ దేవరకొండను నేలకు దింపాయి.
ముఖ్యంగా లైగర్ విజయ్ కు కోరి కష్టాలు తెచ్చి పెట్టింది. కంటెంట్ లేని మూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడం
అందుకోసం కోట్లకు కోట్లు పెట్టి ఇండియా వైడ్ గా ఉన్న మెట్రో సిటీస్ లో విజయ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
తీరా చేస్తే ఈ సినిమా విజయ్ కు విపరీతంగా నష్టం చేసింది. అప్పటికే మొదలైన జనగణమన ఆగిపోయింది.
సమంత అనారోగ్యం సమస్య తో ఖుషి షూటింగ్ పెండింగ్ లో పడిపోయింది. ఈ దశలో సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయాల్సిన మూవీ అలాగే కొరటాలతో చేయాల్సిన సినిమా కూడా ఆగిపోయాయని టాలీవుడ్ సర్కిల్స్ చెప్పుకొస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ తో,అలాగే ప్రభాస్ తోనూ, సుకుమార్ మూవీస్ కమిట్ అయి ఉన్నాడు. అలాగే కొరటాల సంగతి తెలిసిందే.
తారక్ మూవీతో బిజీగా ఉన్నాడు. సో ఈ దర్శకులు మరో రెండు మూడేళ్లు విజయ్ కు అందుబాటులో ఉండరు.
ఆ లెక్కన చూసుకుంటే విజయ్ దేవరకొండకు పెద్ద దెబ్బ కదా అంటున్నారు ఇండస్ట్రీలో కొందరు