అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో ఆకాశమంతా ఎత్తుకు ఎదిగాడు విజయ్ దేవరకొండ.
ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ తో పాన్ సౌత్ అన్నాడు. లైగర్ తో ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టాడు.
ఈ రెండు ప్రయోగాలు వికటించాయి. దాంతో టాలీవుడ్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు రౌడీ.
ముందుగా ఖుషి సినిమాను పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత శివనిర్వాణతో మూవీ చేయబోతున్నాడు.
ఇంకో వైపు ఇప్పుడు గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో న్యూ మూవీ లాక్ చేసుకున్నాడు.
ఈ మూవీని దిల్ రాజు నిర్మించడం మరో విశేషం. మొత్తంగా కొంత గ్యాప్ తర్వాత విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు
ఎంచుకుంటున్న ప్రాజెక్ట్స్ పై రౌడీ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కొత్త సినిమాలన్నిటిని సెట్స్ పైకి తీసుకెళ్లి ఒకోక్కటిగా రిలీజ్ చేస్తూ వెళితే బ్లాక్ బస్టర్ అందించాలని ఫిక్స్ అయ్యారు అభిమానులు.
అనారోగ్యం నుంచి సమంత కోలుకోవడంతో త్వరలోనే ఖుషి షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
మరో వైపు జెర్సీ తర్వాత గౌతమ్ కూడా విజయ్ కోసం పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నాడు.
ఇక పరశురామ్ సంగతి తెలిసిందే. గీత గోవిందంతోనే రౌడీకి 100కోట్ల సినిమాను అందించాడు.
ఈసారి అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసిఉంటాడు. మరోసారి విజయ్ కు జోడీగా రష్మికను ఎంపిక చేసుకునే అవకాశాలే ఎక్కువ.