స్టోరీ రెడీ చేస్తున్న జెర్సీ డైరెక్టర్
త్వరలో అఫీసియల్ ఎనౌన్స్ మెంట్
లైగర్ ఫెయిల్యూర్ గా నిలిచింది.
రౌడీ చేయాల్సిన పాన్ ఇండియా ఫిల్మ్ జనగణమన ఆగిపోయింది.
సమంతతో చేయాల్సిన ఖుషి మూవీ ఆమెకు అనారోగ్యం కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.
ఈ దశలో విజయ్ దేవరకొండ కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాడు.
తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ మలయాళ దర్శకులతో సైతం డిస్కషన్స్ ప్రారంభించాడు.
కన్నడలో ముఫ్టీ లాంటి ఊరమాస్ మూవీ చేయాల్సిన దర్శకుడితో విజయ్ చర్చలు జరుపుతున్నాడని వార్తలు వినిపించాయి. అయితే గౌతమ్ తిన్ననూరి రెడీ చేసిన స్టోరీ విజయ్ కు బాగా నచ్చిందట. నిజానికి రామ్ చరణ్ తో
గౌతమ్ ఒక పాన్ ఇండియా మూవీ చేయాలి. కాని ఈ ప్రాజెక్ట్ అనుకోని పరిస్థితుల్లో హోల్డ్ లోపడింది. దాంతో
గౌతమ్ కేవలం రౌడీ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథను సిద్ధం చేసాడట.
త్వరలోనే ఈ కాంబినేషన్ లో మూవీ ఎనౌన్స్ మెంట్ రానుందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.