లైగర్ తో పాన్ ఇండియా లెవల్లో దెబ్బ తిన్నాడు విజయ్ దేవరకొండ.
అయినప్పటికీ వెనక్కి తగ్గేది లేదంటున్నాడు.
ఈసారి జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలసి,
పాన్ ఇండియా సినిమా చేస్తానంటున్నాడు.
చాలా రోజులుగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోందంటూ ప్రచారం సాగింది.
కాని ఆ విషయాన్ని ఇప్పుడు కన్ ఫామ్ చేసాడు విజయ్ దేవరకొండ.
పైగా రౌడీ ఈసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. చాలా అంటే చాలా రియలిస్టిక్ గా
ఈ సినిమా తెరకెక్కనుందని సమాచాం.
ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ , త్రివిక్రమ్ కలసి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఖుషి షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది విజయ్ దేవరకొండ.
వన్స్ సమంత హెల్త్ పూర్తిగా సెట్ అయితే ఆమె డేట్స్ అందుబాటులోకి వస్తాయి.
జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఖుషి షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయనున్నారు.
ఖుషి షూట్ పూర్తైన తర్వాతే గౌతమ్ తో విజయ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.