ఇలా సినిమాను ప్రారంభించాడు. అలా మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేసాడు పవన్.
తమిళ సినిమా వినోదయ సిత్తం తెలుగు రీమేక్ ను సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటోంది.
పవన్, తేజ్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు సముద్రఖని,
పవన్, తేజ్ పై సీన్స్ అన్ని తెరకెక్కించిన తర్వాతే
తేజ్ అండ్ ఇతర స్టార్ కాస్ట్ పై సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడు దర్శకుడు.
మొత్తంగా పవన్ తో మార్చి నెలాఖరు వరకు షూటింగ్ పూర్తిచేయాలి అనేది
సముద్రఖని టార్గెట్. టాకీ పూర్తైన తర్వాత పవన్, తేజ్ పై ఒక సాంగ్ షూట్ చేస్తారట.
అది మూవీ ప్రమోషన్ కోసం వాడుతారట. నిజానికి ఓరిజినల్ వర్షన్ లో ఎలాంటి సాంగ్స్ లేవు.
కాని మూవీ ప్రమోషన్ కోసమే ఇప్పుడు పాటను తెరకెక్కించనున్నారట.
ఈ సాంగ్ కు తమన్ అద్భుతమైన ట్రాక్ ను అందించాడట.
ఈ మూవీని మే లేదా జూన్ లో రీలీజ్ చేయాలని యూనిట్ ప్రయత్నిస్తోంది.
వినోదయకు త్రివిక్రమ్ మాటలను స్క్రీన్ ప్లేను అందించబోతున్నాడు.