బాలయ్య సిన్మా అంటేనే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. ఇక టీడీపీ సపోర్ట్ ఉండనే ఉంది. ఓ సామాజికవర్గం ఓ సెక్షన్ ఆఫ్ మీడియా పోటీపడి ప్రచారంచేస్తారు. మొన్న ఒంగోలు ఫంక్షన్‌లోనే వీరసింహారెడ్డి దుమ్మురేపేశాడు. తెరవెనుక ఫంక్షన్‌కి వైసీపీ నేతల మద్దతు టీడీపీ నేతల ప్రమోషన్‌తో పార్టీ బహిరంగసభకు భారీ జనసమీకరణ అన్నట్లు జరిగిందా ప్రోగ్రాం. వీరసింహారెడ్డి సిన్మా మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా బాగున్నాయి. అందుకే ఏపీ టూ ఓవర్సీస్ ప్రమోషన్‌లో వీరసింహారెడ్డి స్పీడ్‌ముందు వాల్తేరు వీరయ్య ప్రమోషన్ కాస్త వీక్ అయిపోయింది.
సంక్రాంతి బరిలో పందెం పుంజుల్లా బాలయ్య, చిరంజీవి సిన్మాలు తలపడతాయని ఎవ్వరూ అనుకోలేదు. విడివిడిగా వస్తే దేని సత్తా ఏంటో తేలిపోయేది. రెండూ ఒకేసారి తెరకెక్కేసరికి అభిమానులకు కూడా ఊపిరాడటం లేదు. నా క్రేజ్ అన్‌స్టాపబుల్ అన్నట్టు బాలయ్య హడావుడి సాగుతోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా ఓ రేంజ్‌లో ప్రమోషన్ చేస్తున్నా సింహా స్పీడ్ ఎక్కువుంది. బాలయ్య సిన్మా బెనిఫిట్ షోకి కూడా కొందరు ప్రొడ్యూసర్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారుజామున మూడు బెనిఫిట్ షోలకు రెండేసి వేల చొప్పున టికెట్లు కొని సిన్మా గ్రాండ్ లాంచింగ్‌కి సహకరిస్తున్నారు. వాల్తేరువీరయ్య విషయంలో ఈ హడావిడి మిస్సయిందనే చెప్పాలి.
ఏపీలో సహజంగానే బాలయ్య సిన్మా ప్రమోషన్ ఎక్కువగానే ఉంది. టీడీపీ శ్రేణులు అది తమ పార్టీ ప్రమోషన్ అన్నంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎక్కడ చూసినా సందడే సందడి. నైజాంలో బాలయ్య సినిమా మొదటిరోజే రికార్డ్ సృష్టిస్తుందని ఫ్యాన్స్‌తో పాటు టీడీపీ కేడర్ తొడగొట్టి చెబుతోంది. ఇక సోషల్ మీడియాలో సూపర్, అల్టిమేట్ అంటూ ప్రమోషన్ ఊదరగొట్టేందుకు ఎలాగూ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. బొమ్మ పడితే చాలు పాజిటివ్ రివ్యూలను జనంలోకి వదలడానికి అంతా రెడీ అయిపోయింది. మెగా ఫ్యాన్స్ పవన్, చరణ్, అర్జున్ ఫ్యాన్స్ గా మారిపోయారు. యాభై ఏళ్లుదాటిన చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియా హడావుడికి దూరం. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఒక్కటవుతున్నారు. కలిసి హడావుడిచేస్తున్నారు. అదీ తేడా. మిగిలినదంతా సేమ్ టూ సేమ్.