సమంతకు మళ్ళీ అస్వస్థత?

By KTV Telugu On 24 November, 2022
image

సమంత అనారోగ్యం పై తమిళ మీడియాలో వదంతులు
ఆమెకు తీవ్ర అస్వస్థతకు అంటూ కథనాలు
పూకార్లను నమ్మవద్దు అంటున్న సమంత మేనేజర్

లేడీ సూపర్ స్టార్ సమంత మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ వ్యాధి వల్ల సమంత ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించినట్లు,
ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరళించినట్లు తమిళ మీడియాలో కథనాలు రావడం ప్రారంభమైంది.
దాంతో సమంత మేనేజర్ పుకర్లను నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు.
సమంత తన ఇంట్లో క్షేమంగా ఉన్నారని,
ఇంటి వద్దే వైద్యం కొనసాగుతోందని,
ఆమె వేగంగా కోలుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
సమంత క్షేమంగా ఉన్నారని తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
యశోద విజయంతో లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం మంచి ఉత్సాహంతో ఉంది.
త్వరలో ఖుషి చిత్రాన్ని ప్రారంభించేందుకు ఆమె సిద్ధమవుతోంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సమంత ఉమెన్ సెంట్రిక్ మూవీ చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.