మయోసైటీస్ ట్రీట్ మెంట్ కోసమే అంటూ ప్రచారం
తిరిగొచ్చిన తర్వాత ఫుల్ ఖుషిగా షూటింగ్
సమంత ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్. మరో బ్యాడ్ న్యూస్.
గుడ్ న్యూస్ ఏంటంటే లేడీ సూపర్ స్టార్ త్వరలోనే తిరిగి సినిమా సెట్ లోకి అడుగు పెట్టనుంది.
బ్యాడ్ న్యూస్ ఏంటంటే సామ్ అర్జెంటుగా తనకున్న వ్యాధికి వైద్యం కోసమని సౌత్ కొరియా వెళ్లబోతోంది.
అక్కడ కొద్ది రోజులు ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత సామ్ ఇండియాకు తిరిగి రానుంది.
వచ్చిన వంటనే ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఖుషి మూవీని ముందుగా కంప్లీట్ చేయనుంది.
ఆ తర్వాత మిగితా ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించనుంది. సమంత ఒప్పుకుంటే యశోద -2 తెరకెక్కించేందుకు రెడీగా ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇక రాహుల్ రవీంద్రన్ కూడా ఇటవలే సమంతను కలసి ఉమెన్ సెంట్రిక్ మూవీ స్టోరీని వినిపించి ఇంప్రెస్ చేసాడట. హిందీ తెరకెక్కుతున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ఉంది. సో సమంత సౌత్ కొరియా నుంచి తిరిగిరావడం ఆలస్యం ఆమె డేట్స్ కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.