రూపాయి బలపడే సమయం వచ్చిందా ? ఏదోక రోజున డాలర్ తో సంబంధం లేకుండా వ్యాపారం సాధ్యమా ? అసలు రుపాయి పతనానికి కారణమేమిటి ? దాన్ని పరిష్కరించే చర్యలేమిటి ? ఓ సారి చూద్దాం
ఆల్ టైమ్ రికార్డు దాటిపోయిన మారకం విలువ
అక్టోబరులో 83. 29కి చేరిక
డిసెంబరు ఆఖరుకు 84 దగ్గర స్థిరపడే అవకాశం
కరెన్సీ లేనప్పుడే నయమంటున్న జనం
భారత కరెన్సీ విలువ పతన దిశలో ఉంది. డాలర్ తో రూపాయి ఎక్స్ఛేంజ్ సరికొత్త కనిష్టాలకు చేరింది. గతంలో హెచ్చుతగ్గులు కనిపిస్తే… ఇప్పుడు ఏకంగా తగ్గుదల బాటలోనే ఉంది. అక్టోబరు 20న మన కరెన్సీ మారకం విలువ 83 రూపాయల 29 పైసలుగా ఉంది. తర్వాత కొంత పుంజుకున్నా మళ్లీ దిగజారుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబరు ఆఖరు నాటికి 84 రూపాయల వరకు చేరుకోవచ్చు. అంటే మనం ఒక డాలర్ పొందాలంటే 84 రూపాయలు చెల్లించాలన్నమాట నిజానికి 2021 మార్చిలో మారకం విలువ 71 రూపాయలుండేది. పదేళ్ల క్రితం మారకం విలువ 50 రూపాయలైతే 40 క్రితం కేవలం ఎనిమిది రూపాయలే దాన్ని బట్టే మన రూపీ వాల్యూ ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. దీనితో రాతి యుగం నాటి వస్తు మార్పిడి పద్దతే నయమని ఇప్పటి జనం వాపోతున్నారు. అప్పట్లో పశువులను ఇచ్చి కూడా వస్తువులు కొనుక్కునే వారు.
కరెన్సీ విలువను నిర్ధారించే వడ్డీ రేట్లు
రూపాయిపై ద్రవ్యోల్బణ ప్రభావం
ములధనమే పెరిగితేనే విలువ
పెరగాల్సిన నగదు లభ్యత
ప్రతీ దేశంలోనూ వడ్డీ రేట్ల ప్రభావం కరెన్సీపై ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే జనం బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు ఇటీవల అమెరికాలో జరిగింది కూడా అదేనని చెప్పాలి. అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన అమెరికన్ ఇన్వెస్టర్లు అక్కడ నుంచి నిధులను ఉపసంహరించుకుని తమ దేశంలోకి బదిలీ చేసుకున్నారు అందుకే డాలర్ విలువ పెరిగి దాని ప్రభావం మన కరెన్సీపై కూడా పడింది. మన దేశంలో కూడా అలాంటి పరిస్తితులు తర్వలోనే రావచ్చు. ఆర్థికంగా ఊగిసలాడే దేశాల వైపు ఇన్వెస్టర్లు అసలు దృష్టి సారించరు. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల పౌండ్ విలువ తగ్గి బ్రెగ్జిట్ కాలం నాటి పరిస్థితులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు యూకే నుంచి పారిపోతున్నారు. పెట్టుబడులు తగ్గితే ఇంకో సమస్య ఉంది. కరెన్సీ లోటు కూడా ఏర్పడుతుంది. నగదు లభ్యతకు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల నుంచి ఇన్వెస్టర్లు దూరం జరుగుతున్నారు. మన బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణతో డాలర్ల కొరత ఏర్పడి విదేశీ వ్యాపారానికి, దిగుమతులకు అడ్డుగోడలు ఏర్పడుతున్నారు. అమెరికా డాలర్లలో వ్యాపారానికి డిమాండ్ పెరుగుతోంది. అప్పుడే రూపాయి విలువ పతనమవుతోంది.
స్థిరమైన కరెన్సీ కావడమే డాలర్ కు అట్వాంటేజ్
ప్రతీ దేశానికి డాలర్ మిగులు అనివార్యం
దేశీయ కరెన్సీపై ప్రభావం
కరెన్సీ విలువను కాపాడుకునేందుకు వడ్డీ రేట్లు పెంపు
ఫారిన్ టూర్లు, విదేశీ చదువులకు పెరుగుతున్న వ్యయం
నానాటికి పెరుగుతున్న దిగుమతుల భారం
డాలర్ బలంగా ఉండటం, డాలర్ నే మారకంగా అన్ని దేశాలు వాడటంతో అమెరికా కరెన్సీకి అవసరానికి మించిన విలువ వచ్చేసింది. దానితో ప్రతీ దేశానికి డాలర్ మిగులు అనివార్యమైంది. విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వ చేసుకుని డాలర్ల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. పైగా డాలర్లను ఎక్కువగా నిల్వచేసుకున్నప్పుడే స్థానిక కరెన్సీపై వత్తిడి తగ్గుతోంది. ముడి చముర సహా ఏ వస్తువును దిగుమతి చేసుకోవాలన్నా డాలర్లు చెల్లించడం ద్వారా అమెరికాపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితి నుంచి బయట పడలేకపోతున్నాం. దేశాల ద్రవ్య విధానం కూడా డాలర్ కు అనుకూలంగా ఉంటున్నాయి. కేవలం కరెన్సీ విలువను కాపాడుకునేందుకే దేశాలు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. 33 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను పెంచింది. విహారయాత్రకు అమెరికా వెళ్లాలన్నా, పిల్లలను అమెరికా చదువులకు పంపించాలన్నా ఇప్పుడు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి రావడానికి కారణం డాలర్ విలువ బాగా పెరిగిరపోవడమేనని చెప్పాలి.
2030 కల్లా రూపాయి విలువ పెరుగుతుందని అంచనా
అప్పటి వరకుచేయాల్సిందేమిటి ?
రూపాయి – రూబుల్ విధానంలో రష్యాతో వ్యాపారం
అదే బాటలో శ్రీలంక, కొన్ని ఆసియా దేశాలు
డాలర్ తో సంబంధం లేని వ్యాపారం
రూపాయి పుంజుకోవడానికి మరి కొంత సమయం పట్టొచ్చు. 2030 నాటికి మాత్రమే మారకం విలువ 70 రూపాయల దిగువకు స్థిర పడుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. అప్పటి వరకు కాస్త ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. 2030 దాకా ఆర్థిక స్థితిపై వత్తిడి తగ్గించుకోవడానికి కొత్త మార్గాల అన్వేషణలో కొంత మేర సక్సెస్ సాధించామని ప్రభుత్వం అంటోంది. ఆ దిశగా ఉక్రెయిన్ యుద్ధం ఉపయోగపడింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి రూపాయి – రూబుల్ మారకానికి మన ప్రభుత్వం తెరతీసింది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో వోస్ట్రో ఖాతాలు తెరిచి ఎగుమతి, దిగుమతి వర్తకానికి అందులో డిపాజిట్లకు అవకాశమిచ్చింది. డాలర్లలో కాకుండా రూపాయిల్లో విదేశీ వాణిజ్యం నిర్వహించేందుకు వోస్ట్రో ఖాతాలు ఉపయోగపడతాయి. జూలైలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు యూకో బ్యాంక్ ద్వారానే లావాదేవీలు నిర్వహించేందుకు అనుమతించారు. ఇప్పుడు ఇతర బ్యాంకులకు కూడా విస్తరించారు. రష్యా తర్వాత శ్రీలంక, మాల్దీవ్స్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో వాణిజ్యానికి వోస్ట్రో ఖాతాలను వినియోగించే సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది. అదే జరిగితే డాలర్ల మారకంతో సంబంధం లేకుండా వాణిజ్యం సాధ్యమవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.