కార్యవర్గ సమావేశాల తర్వాత ఈడీ,సీబీఐ దాడులు ఉంటాయా? బీజేపీ ప్లాన్ ఇదేనా

By KTV Telugu On 30 June, 2022
image

జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో బీజేపీ చేస్తున్న హడావుడి వెనుక పెద్ద ప్లాన్ రెడీ చేసిందా..? త్వరలోనే తెలంగాణ రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయా..?  పక్కా ప్లాన్ తో కమలనాథులు అడుగులు వేస్తున్నారా.. ?ఆపరేషన్ 144 జాబాతిలో తెలంగాణ ఉందా..? బీజేపీ నేతల బిగ్ స్కెచ్ ఏంటి?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జెండా ఎగరేసి తీరాలన్న కసి కమలనాథుల్లో అంతకంతకూ పెరుగుతోంది. మోదీ డైరెక్షన్ లో కేసీఆర్ తో తాడో పేడో తేల్చుకునేందుకు సై అంటే సై అంటున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో బీజేపీ హడావుడి ఎప్పుడు లేనంత స్థాయిలో కనిపిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ పేరుతో మోదీ, షాఅగ్రనేతలు, ఎంపీలు హైదరాబాద్ పర్యటనకు రాబోతున్నారు. పది లక్షల మందితో భారీ బహిరంగసభ వేదికగా సమరశంఖం మోగించబోతున్నారు.

గుజరాత్ ఎన్నికలకు ముందే మహారాష్టలో శివసేనను కోలుకోలేని దెబ్బకొట్టారు. గుజరాత్ పక్కనే ఉన్న మహారాష్ట్ర పరిణామాల ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాలున్నాయి. వారసత్వ రాజకీయాలు, సైద్దాంతికపరంగాను శివసేనను గురి చూసి కొట్టింది. పార్టీ ఉనికికే ముప్పు తెచ్చే అస్త్రాన్ని ప్రయోగించింది. గుజరాత్ ఎన్నికలు ముందు ఈ పరిణామాలన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్న్టట్టు కనిపిస్తోంది.  గుజరాత్ తర్వాత ఎన్నికలు జరిగే తెలంగాణ, కర్ణాటకలో ఎవరూ ఊహించని విధంగా పెద్ద ప్లాన్ అమలు చేయతోబోందని ప్రచారం. చాలా లెక్కలు వేసిన తర్వాత  జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది..

 

ఎన్నికలు ఎక్కడ జరిగినా ఏడాది ముందు నుంచి ఎత్త్తులు వేయడం మోదీ జమానాలో బీజేపీ స్టయిల్. ఇదే పంథాను తెలంగాణలోను అమలు చేయాలన్న వ్యూహంతో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ఆపరేషన్ 144 అంటూ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో  పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.  దీని కోసం కొత్త అజెండాతో కాషాయ అగ్రనేతలు పక్కా ప్రణాళికను అమలు చేయబోతున్నారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలతోపాటు కొత్తగా 144 చోట్ల విజయం సాధించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ జాబితాలో తెలంగాణలోని నియోజకవర్గాలు ఉన్నాయి. ఎనిమిది లేక 9  చోట్ల కాషాయ జెండా గెలిచేలా వ్యూహాలు అమలు చేయబోతోంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్,మెదక్ ,మల్కాజ్ గిరి ,హైదరాబాద్ ,చేవెళ్ల ,భువనగిరి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూలు,నల్గొండ,వరంగల్,మహబూబాబాద్ ,ఖమ్మం పై దృష్టి పెట్టింది.

 

ఎప్పటిలాగానే బీజేపీ తెలంగాణలో ఈడీ సీబీఐల్ని ప్రయోగించబోతోందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలోనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ప్రత్యర్ధులను ఈడీ , సీబీఐ వెంటాడాయి. పాత కేసుల్ని తిరగదోడి ప్రధాన నేతలను టార్గెట్ చేశాయి. తమను ఎదిరించే పార్టీలు ఉన్న చోట కేంద్ర సంస్థల్ని తమపై ఉసిగొల్పుతూ బెదిరించేందుకు ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. అయితే ఇదంతా ఒట్టిదేనని.. దర్యాప్తు సంస్థలు తమ పని తాము స్వతంత్రంగా చేసుకుంటున్నాయని కేంద్రం చెప్పడం రివాజుగా మారింది. సరిగ్గా ఎన్నికలు జరిగే ముందు సోదాలు చేసి అరెస్ట్ చేయడం పశ్చిమబెంగాల్ లోను కనిపించింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణలోను కూడా ఇదే జరగబోతోందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పొలిటకల్ టెన్షన్ ఏమలుపు తిరుగుతుందో వెయిట్ అండ్ సీ.