*ఇకనుంచి బీఆర్‌ఎస్‌గా మారనున్న టీఆర్‌ఎస్
*మునుగుడులో బీఎర్‌ఎస్ పార్టీ పేరుతోనే పోటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. అందరూ ఊహించినట్లుగానే అక్టోబర్ 5న తాను స్థాపించబోయే జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు.
ఆ రోజు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో హైదరాబాదులో కేసీఆర్ సమావేశం అవుతారు. అదేరోజు జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తారు. డిసెంబరు 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. ఆదివారం ప్రగతిభవన్‌లో 33 జిల్లాల అధ్యక్షులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో జాతీయ రాజకీయాలపై చర్చించారు. కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు, గుర్తుపై కూడా చర్చ జరిగింది. జాతీయ పార్టీకి భారత రాష్ట్ర సమితి అనే పేరుకే కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం. ఒకవేళ అదే పేరు ఖరారైతే ఇకనుంచి టీఆర్‌ఎస్ కాస్తా బీఆర్‌ఎస్‌గా మారుతుంది. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారినా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు కేసీఆర్. పార్టీ పేరు మారినా కారు గుర్తు మాత్రం మారదని స్పష్టం చేశౄరు. కొత్త పార్టీ పెట్టిన తరువాత చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు కేసీఆర్. దేశంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీతోనే పోటీ ఉంటుందని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడులో అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు సీఎం. మునుగోడులో తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికల బరిలో దిగుతామని అన్నారు. ఈసారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని కేసీఆర్ అన్నారు.